టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.
Indian Cricketers Offer Prayers At Ujjain's Mahakaleswar Temple: ఉజ్జయిన మహాకాళేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు ప్రత్యేకపూజలు చేశారు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించే శివుడి భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ధోతీని ధరించి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పూజల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ కు వచ్చింది.…
Junior NTR: మంగళవారం నాడు హైదరాబాద్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను టీమిండియా క్రికెటర్లు కలవడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకంగా ఎన్టీఆర్ను కలిసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన సతీమణి దేవిశాతో కలిసి ఎన్టీఆర్తో ప్రత్యేకంగా ఫొటో దిగాడు. ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సూర్యకుమార్.. ‘బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.…
India vs Sri Lanka 3rd ODI: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య చివిరిదైన మూడో వన్డే ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా, చివరిదైన మూడో వన్డేలో కన్నేసింది. క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈ వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది.