IND vs NZ: టాస్ గెలిచిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి! తుది జట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India opt to bowl in IND vs NZ Match: ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, మొహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కివీస్ విన్నింగ్ కాంబోతోనే ఆడుతోంది.
భారత్, న్యూజిలాండ్ జట్లు వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళుతున్నాయి. ఐదవ విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో అర్ధంతరంగా మైదానాన్ని వీడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.
Also Read
వన్డే ప్రపంచకప్‌లలో భారత్, న్యూజిలాండ్ టీమ్స్ ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో అయిదు మ్యాచ్‌లు కివీస్ నెగ్గగా.. భారత్ మూడింట్లో గెలిచింది. చివరగా 2019లో సెమీస్‌లో భారత్‌పై న్యూజిలాండ్ పైచేయి సాధించింది.
Also Read: BJP first list: బీజేపీ తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు.. బరిలోకి ముగ్గురు ఎంపీలు..!
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!