IND vs NZ: హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరు.. ఇప్పటివరకు ఆడని ఆ ఇద్దరికి చోటు ఖాయమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav To Play IND vs NZ Match in Hardik Pandya’s Absence: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో ఈ మెగా సమరం జరుగనుంది. ఐదవ విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో అర్ధంతరంగా మైదానాన్ని వీడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో భారత్ ఎవరిని ఆడిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా బంతితో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఇంకా హార్దిక్ అవసరం రాకున్నా.. మిడిలార్డర్లో అతను చాలా కీలకం. గాయంతో హార్దిక్ లేకపోవడం జట్టు సమతూకాన్ని దెబ్బ తీసేదే. హార్దిక్ స్థానంలో బ్యాటర్ కావాలనుకుంటే.. ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌పై ఆడనున్నారు. బౌలింగ్ విభాగం పటిష్టం కావాలనుకుంటే.. మొహ్మద్ షమీ లేదా ఆర్ అశ్విన్ జట్టులోకి వస్తారు. ఇప్పటివరకు బౌలర్‌గా పెద్దగా ఉపయోగపడని శార్దూల్‌ను తప్పించి.. మొహ్మద్ షమీని ఆడిస్తే సూర్య లేదా ఇషాన్‌ను ఎంచుకుని బ్యాటింగ్‌ను బలోపేతం చేసుకోవచ్చు. కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటల్ని బట్టి చూస్తే.. సూర్య, షమీలు నేడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఇప్పటివరకు ప్రపంచకప్ 2023లో ఆడని విషయం తెలిసిందే.
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్న సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. న్యూజిలాండ్ మ్యాచ్ నేపథ్యంలో శనివారం ప్రాక్టీస్ సందర్భంగా అతడు గాయపడ్డాడు. ఫుల్ టాస్ బంతి నేరుగా సూర్య కుడి మోచేతిని బలంగా తాకింది. ఆ తర్వాత అతను సాధన చేయలేదు. అయితే సూర్య గాయం చిన్నదే అని, మ్యాచ్‌కు దూరమయ్యేంత ఇబ్బంది లేదని సమాచారం. హార్దిక్ స్థానంలో సూర్య, శార్దూల్ స్థానంలో షమీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి జట్టు మేనేజ్మెంట్ ఎవరికి అవకాశం ఇస్తుందో.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!