BCCI Announces India Squad For T20I Series Against Australia: వన్డే ప్రపంచకప్ 2023 సమరం ముగిసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిన భారత్.. మరోసారి అదే జట్టుతో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో.. సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయితే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్ అయ్యర్ (తొలి మూడు మ్యాచ్‌లకు దూరం) వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన భారత జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్ మినహా.. మిగతా ఆటగాళ్లందరికీ టీ20 సిరీస్ నుంచి బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. ఈ సిరీస్ కోసం భారత జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడు. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ నవంబర్ 23న విశాఖపట్నంలో జరగనుంది. రెండో మ్యాచ్ 26న తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ 28న గువాహటిలో, నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో.. ఐదో మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరులో జరగనుంది.
Also Read: CPI Narayana : బిగ్‌బాస్ బ్రోతల్‌హౌస్ అన్న వ్యాఖ్యల్ని సమర్థించుకున్న నారాయణ
టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.