IND vs NZ 3rd T20I: గౌహతిలో టీమిండియా బ్యాటర్లు విశ్వ రూపం దాల్చారు. బౌలర్ ఎవరైనా సరే బాల్ బౌండరీ దాటాల్సిందే అన్నట్లుగా రెచ్చిపోయారు. మూడో టీ20లో టీమిండియా న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ఎటాక్ తో కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కివీస్ బ్యాటర్స్ లో గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్…
భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. నాగ్‌పూర్‌లో విజయంతో సిరీస్‌ను ప్రారంభించిన భారత జట్టు రెండో టీ20లో ఆధిపత్యం చెలాయించడం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ, భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది.…
టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్‌పూర్‌లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. గతంలో భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో ఓడించిన న్యూజిలాండ్.. ఇప్పుడు వన్డేల్లో కూడా ఓడించింది. ఇరు జట్ల మధ్య బుధవారం (జనవరి 21) నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ పొట్టి సిరీస్ రెండు జట్లకు టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంగా ఉపయోగపడనుంది. టీ20ల్లోనూ రెండు జట్ల మధ్య…
Suryakumar Yadav: మ్యాచ్ ఏదైనా, మైదానం ఎక్కడైనా, ప్రత్యర్థి ఎవరిదైనా.. ఈ ఏడాది మాత్రం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి పరుగులు రాబట్టడానికి తెగ కష్టపడుతున్నాడు. అయినప్పటికీ తన ప్రదర్శన పై నమ్మకంగా ఉన్నాడు టీమిండియా కెప్టెన్. తాను అవుట్ అఫ్ ఫామ్‌గా అంటే వినడానికి మాత్రం అతను సిద్ధంగా లేడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మరి…
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఓటమిపై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. తాను, శుభ్‌మన్ గిల్ బాధ్యత తీసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, బౌలింగ్‌లో ప్లాన్ బీ కూడా లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన…
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ‘మిస్టర్ 360’ అని పేరుంది. ఈ ట్యాగ్ ఊరికే రాలేదు. కెరీర్ ఆరంభంలోనే మైదానం నలుమూలలా షాట్స్ ఆడేవాడు. సూర్య క్రీజులోకి వచ్చాడంటేనే.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టేది. ఎంత మంచి బంతి వేసినా.. విన్నూత షాట్లతో బౌండరీ లేదా సిక్స్ బాదేవాడు. అయితే కొంతకాలంగా సూరీడి బ్యాటింగ్‌లో మెరుపులు తగ్గాయి. చివరి 19 టీ20 ఇన్నింగ్స్‌లో 222 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు స్ట్రైక్ రేట్ కూడా 120కి…
Team India Playing XI: టెస్ట్ సిరీస్‌లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్‌పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది.