భారత బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు(732) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్‌చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి…
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 46 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను కిందకు నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆజమ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని…
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ ఆటగాడిగా అవతరించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్థానాన్ని రిజ్వాన్ ఆక్రమించాడు. దీంతో బాబర్ ఆజమ్ రెండో స్థానానికి పడిపోయాడు. రిజ్వాన్ ఖాతాలో 815 రేటింగ్ పాయింట్లు ఉండగా బాబర్ ఆజమ్ ఖాతాలో 794 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో మహ్మద్ రిజ్వాన్ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే…
మంగళవారం సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో సూర్య కుమార్ యాదవ్(44 బంతుల్లో 76 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో పాటు రిషభ్ పంత్ అజేయంగా 33 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోన్న భారత్.. ఇది ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆ సిరీస్‌కు భారత జట్టుని ప్రకటించింది. ఆ జట్టుకి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గానూ, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గానూ నియమించింది. ప్రెజెంట్ దక్షిణాఫ్రికాతో తలపడుతున్న భారత్‌కి నాయకత్వ బాధ్యతలు చేపడుతోన్న రిషభ్ పంత్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ జట్టులో సంజూ శాంసన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు…