Suryakumar Yadav: సమష్టి ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జట్టు సమష్టి ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచామని టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇదో అద్భుతమైన సిరీస్ అని, కుర్రాళ్లంతా పూర్తి ఆధిపత్యం చెలాయించారన్నాడు. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 6 పరుగులతో ఆ్రస్టేలియాను ఓడించి సిరీస్‌ను 4-1తో ముగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో భారత్ సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఇది మంచి సిరీస్. మా కుర్రాళ్లు అందరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు అభినందనీయం. నిర్భయంగా ఉండాలనుకున్నాం. మధ్య ఓవర్లలో ఆటను ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. మా కుర్రాళ్లకు మీ ఆటను ఆస్వాదించండని సూచించాను. ఈ సిరీస్ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే ఈ మ్యాచ్ మరింత సులువయ్యేది. చిన్నస్వామి స్టేడియంలో 200లకు పైగా లక్ష్యాన్ని కూడా సునాయసంగా చేధించవచ్చు. అయితే ఈరోజు 160-175 లక్ష్యాన్ని చేధించడం కష్టమైంది. 10 ఓవర్ల తర్వాత విన్నింగ్ రేసులో ఉన్నామని మా కుర్రాళ్లకు చెప్పాను’ అని తెలిపాడు.
Also Read
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. బెన్ మెక్‌డెర్మోట్ (54; 36 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!