నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. ఈ న్యాయమూర్తులందరినీ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. అంతే కాకుండా.. మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానితుల జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్…
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో విచారణ చేపట్టగా, ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కేసును వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేదీ,…
బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు ఈ నెల 21వ తేదీ లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి పొడిగింపు కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
చంద్రబాబు అరెస్ట్పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది.
చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు.