Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.
Sandeshkhali Violence: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని రోజులుగా నిరసన, ఆందోళనతో అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహన్ అతని అనుచరులు ఆ ప్రాంతంలో మహిళపై అత్యాచారాలు జరపడంతో ఒక్కసారిగా మహిళలు, యువత టీఎంసీ గుండాలకు ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాంతం బీజేపీ వర్సెస్…
Supreme Court: ఒక కుటుంబంలో జీతం తీసుకువచ్చే ఉద్యోగి ఎంత ముఖ్యమో, గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబాన్ని చూసుకునే స్త్రీ విలువ చాలా ఉన్నతమైందని, ఆమె పని అమూల్యమైనదని పేర్కొంటూ.. ఆమె సేవల్ని డబ్బుతో లెక్కించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మోటార్ ప్రమాదం కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచింది.
దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను కవిత గతేడాది సవాల్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు.
పరువునష్టం దావా కేసులో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన పరువునష్టం ఫిర్యాదును న్యాయస్థానం కొట్టేసింది.
మహారాష్ట్రలో రాజకీయం హీటెక్కింది. ఎన్సీపీ పార్టీలో చీలికతో శరద్ పవార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.