Sandeshkhali Violence: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని రోజులుగా నిరసన, ఆందోళనతో అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహన్ అతని అనుచరులు ఆ ప్రాంతంలో మహిళపై అత్యాచారాలు జరపడంతో ఒక్కసారిగా మహిళలు, యువత టీఎంసీ గుండాలకు ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాంతం బీజేపీ వర్సెస్ పోలీసులుగా మారింది.
Read Also: Port workers union: ఇజ్రాయిల్ వెళ్లే నౌకలను నిర్వహించం.. పోర్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపు..
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామంలో జరిగిన హింసాకాండపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఫిబ్రవరి 16న అలఖ్ శ్రీవాస్తవ అత్యవసర జాబితా కింద పిటిషన్ దాఖలు చేశారు. సందేశ్‌ఖలీ హింసాకాండలో బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని , విధి నిర్వహణలో నిర్లక్ష్య వహించినందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులపై చర్యలు తీసుకోవాని పిటిషన్‌లో కోరారు.
అధికార టీఎంసీ నేతగా ఉన్న షేక్ షాజహాన్ రేషన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారించేందుకు వెళ్లిన ఈడీ అధికారులుపై అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. సందేశ్‌ఖలీలో తమపై టీఎంసీ గుండాలు అఘాయిత్యాలకు పాల్పడటంతో పాటు తమ భూముల్ని ఖబ్జా చేశారని అక్కడి మహిళలు, ప్రజలు ఆరోపిస్తున్నారు.