తమ విభేదాలను పక్కనబెట్టి, షెడ్యూల్డ్ కులాల కోటాలో రిజర్వేషన్లు నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాలకు రిజర్వేషన్లలో ఎక్కువ వాటాను అందజేస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
Supreme Court: సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. 44 ఏళ్ల అవివాహిత మహిళ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పాశ్చాత్య దేశాల వలే వివాహం కాకుండా పిల్లలు కనడంలా కాకుండా, వివాహ పవిత్రతను కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో సరోగసీ ద్వారా తల్లికావడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్…
ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను జత చేసింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా న్యాయస్థానం స్వీకరించి విచారణ చేస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరుకావడం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయగా, తదుపరి తేదీ వరకు మధ్యంతర ఉపశమనం మంజూరు…
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది.