electoral bonds: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పుకొచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదన్నారు. విరాళాల దాతల పేర్లు గోప్యంగా ఉంచడం సరికాదని రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది.
Read Also: Reliance Share: ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలిపిన రిలయన్స్ .. 55శాతం పెరిగిన సంపద
అయితే, ఐదుగురు న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) ప్రకారం విరుద్ధమని చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాల్సిందేనని తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఇతర మార్గాలున్నాయి.. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరు అనే విషయాన్ని సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది.
Read Also: Bharat Bandh: రేపు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..
అయితే, రాజకీయ పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియాలి అని సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం తెలిపింది. 2019 నుంచి జారీ చేసిన ఎలెక్టోరల్ బాండ్స్ వివరాలు బహిర్గతం చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెబ్ సైట్ లో పెట్టాలి అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.