Supreme Court: “గృహిణి విలువ ఎంతో ఉన్నతం”.. ఆమె జీతం తెచ్చే ఉద్యోగి కన్నా తక్కువేం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఒక కుటుంబంలో జీతం తీసుకువచ్చే ఉద్యోగి ఎంత ముఖ్యమో, గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబాన్ని చూసుకునే స్త్రీ విలువ చాలా ఉన్నతమైందని, ఆమె పని అమూల్యమైనదని పేర్కొంటూ.. ఆమె సేవల్ని డబ్బుతో లెక్కించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మోటార్ ప్రమాదం కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచింది.
వాహన ప్రమాద కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. ఇంట్లో గృహిణి విధులు చాలా ముఖ్యమైనవి, ఆమె చేసే కార్యకలాపాలను ఒక్కొక్కటిగా లెక్కించినట్లైతే వాటి విలువ అమూల్యమైందిగా ఉంటుంది, ఆమె ఇచ్చి సహకారం చాలా ఉన్నతమైందని, అందులో ఎలాంటి సందేహం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. 2006 ప్రమాదంలో మరణించిన మహిళకు మెరుగైన పరిహారాన్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
బాధిత మహిళ ప్రయాణిస్తున్న వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాహన యజమానిపై పడింది. ఒక మోటార్ యాక్సికెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఆమె కుటుంబానికి, ఆమె భర్త, మైనర్ కుమారుడికి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ఇచ్చింది. సదరు కుటుంబం ఎక్కువ నష్టపరిహారం కోసం ఉత్తరాఖండ్ హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే, మహిళ గృహిణి అని 2017లో వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే హైకోర్టు పరిశీలనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. గృహిని ఆదాయాన్ని రోజూవారీ కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారు.? అలాంటి విధానాన్ని మేం అంగీకరించమని పేర్కొంది. పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ, మరణించిన మహిళ కుటుంబానికి ఆరు వారాల్లోగా చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. గృహిణి విలువను ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదని చెప్పింది.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!