Chandigarh Mayor Row: సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ మేయర్ రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కుల్దీప్ కుమార్‌ను ఓడించడం ద్వారా ఇండియా కూటమికి వ్యతిరేకంగా సోంకర్ గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్-ఆప్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ సింగ్‌కి 12 ఓట్లు వచ్చాయి. అయితే, 8 ఓట్లు చెల్లనవిగా ప్రకటించడంతో రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే, ఆప్‌కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు పూనమ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Read Also: Glod Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
35 సభ్యుల ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, ఆ తర్వాత పలువరు బీజేపీలో చేరడంతో 17కి చేరింది. శిరోమణి అకాళీదళ్ నుంచి ఒక అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. చండీగఢ్ ఎంపీ, బీజేపీకి చెందిన కిర్రోన్ ఖేర్‌కి ఎక్స్-అఫిషియోగా ఓటు హక్కు ఉంది. దీంతో బీజేపి మ్యాజిక్ ఫిగర్ 19గా ఉంది.
జనవరి 30న ఫలితాలు వెలువడిన వెంటనే, కాంగ్రెస్ మరియు ఆప్ కౌన్సిలర్లు బిజెపి మోసం చేసిందని, ఎన్నికల ప్రక్రియను అనుసరించడం లేదని ఆరోపించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డారని సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోని కోర్టుకు సమర్పించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. ఈ కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!