మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కుల నిర్ధారణ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు. ఈ విషయం సంబంధించి అప్పట్లో అయితే చర్చ జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు ఆవిడకు రెండు లక్షల జరిమానాను కూడా విధించింది.…
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీప్ ఇచ్చింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.
జ్ఞాన్వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్ జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ సవాలు చేసింది.
PM Modi: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విరుచుకుపడ్డారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారి హోదాతో సంబంధం లేదకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.
PM Modi: రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కి లేఖ రాశారు.
పలువురు న్యాయవాదులు తాజాగా మన దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని వత్తిళ్లు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రముఖ లాయర్లు ఈ మేరకు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ లతో సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడకు…