సార్వత్రిక ఎన్నికల ముందు సందేశ్‌ఖాలీ ఘటన పశ్చిమబెంగాల్‌ను ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఆందోళనలు, నిరసనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్.. భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సందేశ్‌ఖాలీ మహిళలు ఆరోపించారు. పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. దీనికి బీజేపీ కూడా సపోర్టుగా నిలిచింది. నిందితుడ్ని అరెస్ట్ చేయాలని బీజేపీ నిరసనలు చేపట్టింది. మొత్తానికి కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాన్ని ఏప్రిల్ 29న న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
ఇది కూడా చదవండి: Victory Venkatesh: వెంకటేష్‌కి వింత పరిస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం?
భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని టీఎంసీ నేత షాజహాన్‌పై మహిళలు ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత బీజేపీ రంగంలోకి దిగి మహిళలకు మద్దతు నిలిచి నిరసనలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆందోళనలు చేపట్టారు. అనంతరం పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీసులు… నిందితుడ్ని సీబీఐ అధికారులకు అప్పగించారు.
ఇదిలా ఉంటే బెంగాల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ.. బాధిత మహిళలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాకుండా మోడీ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై.. ఇండియా కూటమిపై ప్రధాని ధ్వజమెత్తారు. ఇంత ఘోరం జరిగితే.. ఇండియా కూటమి పార్టీలు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. ఇక దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సందేశ్‌ఖాలీ బాధిత మహిళకు బీజేపీ టికెట్ ఇచ్చి బరిలో నిలబెట్టింది.
ఇది కూడా చదవండి:Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..