సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారన్నది కోర్టు ముందు కేజ్రీవాల్ వాదన వినిపించారు. అనంతరం.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు తప్పుడు ప్రకటనలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ అఫిడవిట్లో ఆర్డర్‌ను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి పతంజలి వివరణాత్మక సమాధానం దాఖలు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోర్టుల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సతమతం అవుతున్న ఆ నేతలకు తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రధాని మోడీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలినట్టైంది.…
వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి 'జీరో ఎమిషన్స్' సాధించాలనే భారత్ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది.