Supreme Court: వీవీప్యాట్‌లపై దాఖలైన అన్ని పిటిషన్లను భారత సుప్రీం కోర్టు కొట్టే వేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరి పోల్చాలన్న పిటిషన్లపై విచారణ చేసిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్‌లో పెట్టింది. అయితే, ఇవాళ (శుక్రవారం) ఉదయం ఆ పిటిషన్లను మొత్తం కొట్టేస్తున్నట్లు తీర్పును వెల్లడించింది. ఈవీఎంల పని తీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తరవాత వాటిని 100 శాతం లెక్కించాలంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది.
Read Also: Ileana D’Cruz : ఎట్టకేలకు పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ఇలియానా..?
ఇక, వీటిపై గత మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. చివరకు ఆ పిటిషన్లు కొట్టేస్తున్నట్లు ఏకాభిప్రాయంతో కూడిన తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ తెలిపింది. వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యం.. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం మంచిది కాదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అందుకే, అర్థవంతమైన విమర్శలు చేయాలి.. అది న్యాయ వ్యవస్థ అయినా సరే చట్ట సభలు అయినా సరే అని పేర్కొనింది. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం అని ద్విసభ్య ధర్మాసనం చెప్పుకొచ్చింది. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు అని జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ తీర్పు ద్వారా వెల్లడించారు.