Supreme Court: ఆ విషయంలో ఎన్నికల సంఘాన్ని మేము నియంత్రించలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసింది.. మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో.. వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తహాడ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం నాడు ఈ కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టు ఎన్నికలను నియంత్రించలేదని.. ఒక రాజ్యాంగ సంస్థ ( ఈసీ)పై పెత్తనం చలాయించే అధికారం లేదని క్లారిటి ఇచ్చింది.
Read Also: World Malaria Day: నేటి నుంచి దేశంలో మలేరియా నిర్మూలన ప్రాజెక్ట్ చివరి దశ షురూ
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ఇక, ఈవీఎంల పని తీరుపై ఐదు ప్రధాన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ నుంచి వివరణ వచ్చాయి.. ఇరు వర్గాల వాదోపవాదాలనూ విన్న తర్వాత కోర్టు ఈ విషయాన్ని తెలిపింది. కేవలం అనుమానం ఆధారంగా ఆదేశాలు జారీ చేయడం కుదరదని తెలిపింది.. హ్యాకింగ్ జరిగిన ఉదంతాలు లేవని పిటిషనర్ తెలిపిన నివేదికు కోర్టు స్పష్టం చేసింది. 5 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఏంలతో పోల్చి చూడాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషన్ అమలు చేసిందని ద్విసభ్య ధర్మాసనం గుర్తు చేసింది. ఇంకా ఏదైనా దుర్వినియోగం జరిగినట్లు ఏ అభ్యర్థి అయినా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దామని చెప్పుకొచ్చింది. ఈవీఎంల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలియజేస్తూ.. తీర్పును వాయిదా వేసింది.
Read Also: Ramasahayam Raghuram Reddy : ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు..
అలాగే, ఈవీఎంలలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయని ఈసీ తెలిపింది. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఒక కేబుల్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక, మనం వేసిన గుర్తుకే ఓటు పడిందీ లేనిదీ ఈ వీవీప్యాట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొనింది. కాగా, ఈవీఎంల మైక్రో కంట్రోల్ యూనిట్‌ల ఫ్లాష్ మెమొరీలను మళ్లీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని ఈసీ వాదించింది. ఇందులో ఏ సాఫ్ట్‌వేరూ ఉండదు.. కేవలం 1024 వరకూ ఎన్నికల గుర్తులనే లోడ్ చేస్తామన్నారు. దాని మెమొరీయే తక్కువ స్థాయిలో ఉంటుందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను ద్విసభ్య ధర్మసానం గుర్తు చేసింది. ఈసీ ఇచ్చిన సాంకేతిక నివేదికను నమ్మల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!