దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతున్న వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court: వీవీప్యాట్‌కు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత ఉండాలని కోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించింది.
మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు వేసింది. గోసంరక్షకులు, అల్లరిమూకల కేసులపై తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా తెలియజేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మహిళా సంస్థ పిటిషన్‌ను ఆరు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో సహా సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మరోసారి మందలించింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు ఏం కాదని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23వ…
మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను మార్చి 21న అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తన అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును విచారించనున్నారు.