భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) నాయకుడు హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది.
యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట, వంద మందికి పైగా మరణించిన కేసు మంగళవారం సుప్రీంకోర్టు ముందు ప్రస్తావనకు రానుంది. ఈ పిటిషన్ ను సీజేఐ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించనున్నారు.
మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీరియడ్ లీవ్ మంజూరు కోసం ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని ఈ పిటిషన్ దాఖలైంది.
చలనచిత్రాలు, దృశ్యమాధ్యమాల్లో దివ్యాంగుల చిత్రీకరణపై నిర్మాతలకు సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. వైకల్యంపై కించపరిచే వ్యాఖ్యలు లేదా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోర్టు పేర్కొంది.
Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
NEET-UG 2024: నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీంతో నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది.
నీట్-యూజీ పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి.. తీర్పువెలువరించనుంది. నీట్-యూజీ పరీక్ష రద్దు చేయాలని.. పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.