ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ ఏప్రిల్‌లో తయారీ లైసెన్స్‌లను సస్పెండ్ చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించామని తెలిపింది. అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్’ గురించి ప్రస్తావన..
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆయుర్వేద సంస్థ నుంచి స్పందన వచ్చింది. తదుపరి విచారణకు జూలై 30న వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ.. జులై 10న డేటాథాన్ సదస్సు!
కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మరియు ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా పతంజలి స్మెర్ ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మరియు దివ్య ఫార్మసీకి చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌లను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇది కూడా చదవండి: Bharateeyudu 2: భారతీయుడు -2 టీంకి నా ప్రత్యేక అభినందనలు : సీఎం రేవంత్ రెడ్డి