NEET UG 2024: మే 5వ తేదీన జరిగిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్-యూజీ 2024పై తీవ్ర దుమారం రేగింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరపనుంది.
కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్లను అమర్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. మరోవైపు ఈ ఉత్తర్వులపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆయా పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు విచారించింది.
ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాను కమిషన్ ఛైర్మన్గా వైదొలిగినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తనకు రాసిన లేఖలో కూడా సమాజం అంగీకరించే భాష వాడలేదని అన్నారు. విచారణ కమిషన్లు వేసేదే.. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను గతంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్పై వేసిన కమిషన్కు కూడా పనిచేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు.
Supreme Court: కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. సుప్రీంకోర్టులో ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్పై రేపు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. జస్టిస్ నర్సింహారెడ్డి రెడ్డి కమిషన్ సమన్ల పై జూలై 1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాలు చేశారు కేసీఆర్. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి…
DK Shiva kumar : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.