సుప్రీంకోర్టులో జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు స్థాపించిన 75వ సంవత్సరంలో ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తోంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించనున్నారు. సామాన్య ప్రజలు ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో.. తగిన పెండింగ్లో ఉన్న కేసుల సామరస్య పరిష్కారాన్ని కనుగొనడానికి సుప్రీంకోర్టు 2024 జూలై 29 నుండి 2024 ఆగస్టు 3 వరకు ప్రత్యేక…
నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
NTA Petition : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నీట్కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఈ పిటిషన్లో డిమాండ్ చేశారు.
నీట్-యూజీ2024 పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్2024 ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో కౌన్సిలింగ్పై స్టే ఇవ్వడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన పరిస్థితి ఏర్పాడింది. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది
Delhi Water Crisis : నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది.