Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ ఇసుక తవ్వకాలపై జస్టిస్ అభయ్ ఒకా ధర్మాసనం ముందు విచారణ చేశారు.. అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది.. అయితే, ఆగస్టు 2వ తేదీ నాటికి ఏపీలో అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.. మరోవైపు.. ఇప్పటికే ఏడు జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని వెల్లడించారు కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది.. మరో ఆరు జిల్లాల్లో తనిఖీకి ఆరు వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్ర ప్రభుత్వం. కాగా, ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విదితమే..
Read Also: Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్