Big Breaking: గ్రూప్ 1 అభ్యర్థులను ఆందోళనకు సుప్రీం కోర్టు ధర్మాసనం తెర దించింది. నేటి నుంచి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది
ఉరిశిక్ష పడిన వ్యక్తిని 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తన భార్య, తల్లి, రెండేళ్ల బాలికను హత్య చేశాడని ఆరోపించారు.
Supreme Court: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన సాప్ట్ వేర్ తో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేయబోతున్నట్లు తెలిపింది.
Supreme Court on Child Marriage: బాల్య వివాహాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలపై మార్గదర్శకాలను జారీ చేసిన కోర్టు, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టం ప్రకారం సంప్రదాయాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. బాల్య వివాహం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును హరిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం…
Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ యొక్క ఇషా ఫౌండేషన్ పై చట్టవిరుద్ధ నిర్బంధంలో సుప్రీంకోర్టు శుక్రవారం విచారణను నిలిపివేసింది. అంతకుముందు అక్టోబర్ 3న, ఫౌండేషన్‌పై పోలీసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. ఫౌండేషన్‌పై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమార్తెలు లత, గీతలను ఆశ్రమంలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. దీనిపై సెప్టెంబర్ 30న ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసుల…
Dera Sacha Sauda: 2015 నాటి మూడు ఇంటర్లింక్డ్ బర్గారీ సాక్రిలేజ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై విచారణపై పంజాబ్ – హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. బర్గారీలో గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై గుర్మీత్ రామ్ రహీమ్‌పై జరుగుతున్న మూడు కేసుల్లో విచారణను మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు…
Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది.
Justice Sanjiv Khanna will be the Supreme Court CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చంద్రచూడ్ సిఫార్సులకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే.. సుప్రీంకోర్టు 51వ సీజేగా సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండవ అత్యంత…