Supreme Court: సంబంధాలు విచ్ఛన్నం కావడం మానసిక వేదనకు గురిచేస్తున్నప్పటికీ, నేరపూరిత నేరానికి దారితీసే ఉద్దేశం, ఆత్మహత్యలకు ప్రేరేపించదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఐపీసీ కింద మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాలకు కర్ణాటక హైకోర్ట్ కమరుద్దీన్ దస్తగిర్ సనాదికి విధించిన శిక్షను కోర్టు కొట్టివేసింది.
Sambhal Mosque Survey: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో గల షామీ జమా మసీదు కమిటీకి భారీ ఊరట లభించింది. సంభాల్ మసీద్ వివాదంపై విచారణకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా, షాహీ జామా మసీదు కమిటీ వేసిన పిల్ ను ఈరోజు (నవంబర్ 29) సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
Sambhal Jama Masjid: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ సంభాల్ నగరంలో జామా మసీదు అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు.ఈ హింసాత్మక ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
Supreme Court:ఏకాభిప్రాయంతో ‘‘రిలేషన్షిప్’’ నడిపి, అది కాస్త చెడిపోయిన తర్వాత అత్యాచార కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరువురు వివాహ సంబంధం లేకుండా, ఇష్టపూర్వకంగా సుదీర్ఘమైన శారీరక సంబంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాల్లో వివాదాలు చెలరేగి జంట విడిపోతున్నారు. ఇలాంటి సమయంలో సదరు వ్యక్తిపై మహిళలు అత్యాచారం కేసులు పెడుతున్నారు. Read Also: INDIA Bloc: మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం! తాజాగా,…
Supreme Court: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటం తప్పే.. అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court: ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్ని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలాలే ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Sambal Conflict: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా క్షిణించింది. దీంతో కాలుష్య నివారణకు చేపట్టిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 4 అత్యవసర చర్యలను కొనసాగించాలా వద్దా అని సుప్రీంకోర్టులో ఈరోజు (సోమవారం) విచారణకు రానుంది.