సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చారు.
Supreme court: ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Supreme Court: నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు క్యాంటీన్లో మాంసాహారాన్ని అనుమతించడంపై వివాదం మొదలైంది. క్యాంటీన్లో మాంసాహారాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల బృందం కోర్టు బార్ అసోసియేషన్, ఇతర న్యాయ సంఘాలను ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టులో పెద్ద దుమారానికి కారణమైంది.
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ కార్డుల జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకున్నా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని ధ్వజమెత్తింది.
ప్రభుత్వంపై జర్నలిస్టులు చేసే విమర్శలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు..
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చ గొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్నారు.. ఇక, చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది.. స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలు ఆడి జంతువుల కొవ్వు…
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. ఈ బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, , ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని ప్రస్తావించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. Rashmika Mandanna: మరీ అంత క్యూట్…