Delhi Pollution: ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. 12వ తరగతి వరకు అన్ని స్కూళ్లు బంద్
- రోజు రోజుకు దారుణంగా మారుతున్న ఢిల్లీ పరిస్థితి
- ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్‌లైన్‌లోనే
- స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
- ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 1000 దాటిన AQI స్థాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. అధిక కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. విద్యార్థుల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్‌లైన్‌లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు మిగతా విద్యార్థుల పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా 10, 12వ తరగతి స్కూళ్లు మూసివేయాలని కోర్టు ఆదేశించింది.
Read Also: TTD: శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ, NCR పరిస్థితి చాలా దారుణంగా మారింది. అనేక ప్రాంతాల్లో AQI స్థాయి 1000 దాటింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో గ్రాప్-4ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు 10, 12వ తరగతి పాఠశాలల విద్యార్థుల తరగతులు కూడా ఆన్‌లైన్ లో నిర్వహించేలా ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈరోజు ఈ గ్రేప్-4 అమలుకు సంబంధించిన సమావేశం రద్దయింది.
Read Also: Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
మరోవైపు.. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు (నవంబర్ 18) నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు. కేవలం నిత్యవసర సరకులు తీసుకువచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ అయిన లైట్ మోటర్ గూడ్స్ వెహికల్స్‌ను కూడా నిషేధించారు. బీఎస్ 4, డీజిల్ వాహనాలను కూడా అనుమతించడంలేదు. అలాగే.. నిర్మాణాలపై తాత్కాలిక నిషేధం విధించింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?