నష్ట పరిహారం అందజేయడానికి ఆధార్ కార్డులోని వయసును చూడడం కరెక్ట్ కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమాత విగ్రహాన్ని మార్చడంపై బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్పు చేసే ముందు తమ సభ్యులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శరద్‌పవార్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గడియారం గుర్తు తమకే కేటాయించాలంటూ శరద్‌పవార్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Bulldozer Action: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో ఇటీవల దుర్గా నిమజ్జనం సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రాను వేరే వర్గం వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పోలీసులు మహ్మద్ ఫహీన్, మహ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మహ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ మరియు మహ్మద్ అఫ్జల్‌ని అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతున్న సమయంలో మహ్మద్ తలీమ్, మహ్మద్ సర్ఫరాజ్‌లను పోలీసులు ఎన్కౌంటర్ చేసి పట్టుకున్నారు.
ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మోడీ డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబల్ సహా సీనియర్ న్యాయవాదులను మేము ఈ కేసు కోసం నియమించామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ హైకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందని కోర్ట్ స్పష్టం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి వాటిని వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు భావించిందన్నారు. పరీక్షలు నిర్వహిస్తే నిర్వహించారు, ఫలితాలను…
Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారుల అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు.
Madrassas: గుర్తింపు లేని మదర్సాల విద్యార్థులను ప్రభుత్వ స్కూల్స్ కు తరలించాలని, మదర్సా బోర్డులకు రాష్ట్రాలు నిధులు ఇవ్వొద్దని రాష్ట్రాలను కోరుతూ బాలల హక్కుల సంఘం చేసిన సిఫార్సులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.