Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా క్షిణించింది. దీంతో కాలుష్య నివారణకు చేపట్టిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 4 అత్యవసర చర్యలను కొనసాగించాలా వద్దా అని సుప్రీంకోర్టులో ఈరోజు (సోమవారం) విచారణకు రానుంది. అయితే, దీపావళి పండగ తర్వాత నగరంలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. ఇక, ఎయిర్ మానిటరింగ్ స్టేషన్‌లలో 200 నుంచి 300 మధ్య AQI స్థాయిలను నమోదు అయ్యాయి. అయితే కొన్ని ఇప్పటికీ పలు ప్రాంతాల్లో గాలి చాలా పేలవమైన విభాగంలోనే కొనసాగుతుంది.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్!
కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ సందర్భంగా ఢిల్లీ-NCR గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను అమలు చేస్తున్నారు. ఈ రూల్ అమలులో ఉన్నప్పుడు అవసరమైన వస్తువులను తీసుకువెళ్లడం లేదా ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, బీఎస్-VI డీజిల్ లేదా ఎలక్ట్రిక్ లాంటి ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలు మినహా ట్రక్కుల ప్రవేశంపై నిషేధం ఉంటుంది. అలాగే, ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రలో బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో AQI 318గా నమోదు అయింది. మరోవైపు, కాళింది కుంజ్ సమీపంలోని యమునా నదిపై విషపూరిత నురుగు వచ్చింది. ఇది నీటిలో అధిక కాలుష్య స్థాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ నుంచి గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high. pic.twitter.com/Dte7k4dZZn
— ANI (@ANI) November 25, 2024
#WATCH | Delhi: A layer of haze shrouds the national capital as the air quality remains in 'Poor' category, as per Central Pollution Control Board (CPCB).
(Visuals from near India Gate area) pic.twitter.com/4VB73aydWt
— ANI (@ANI) November 25, 2024