Ban jokes on Sikhs: సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి జోకులను ప్రదర్శించే వెబ్‌సైట్లను నిషేధించాలే ఆదేశాలు ఇవ్వానలి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ‘‘ఇది చాలా ముఖ్యమైన విషయం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. పిటిషనర్ హర్విందర్ చౌదరి, ఇతర పార్టీలు చేసిన సూచనలతో పాటు తన సొంత సూచనలను కూడా ఏకీకృతం చేసి ఒక సంకలనాన్ని దాఖలు చేస్తానని చెప్పారు.
Read Also: Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..
హర్విందర్ చౌదరి సిక్కు మహిళల మానసిక వేదనను ఎత్తి చూపారు. వారి వస్త్రధారణని అపహస్యం చేస్తున్నారని, పాఠశాలల్లో సిక్కు పిల్లలు కూడా వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు. పాఠశాలల్లో వేధింపుల కారణంగా ఒక సిక్కు బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను కోర్టు ముందుకు తీసుకువచ్చారు.
అక్టోబరు 2015లో, అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణకు అంగీకరించింది. దాదాపు 5,000 వెబ్‌సైట్‌లు సిక్కులపై జోక్‌లను ప్రదర్శించాయని ఆరోపిస్తూ, అలాంటి వెబ్‌సైట్‌లపై నిషేధం విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు, ఈ జోకులు గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. దీనికి ముందు, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) కూడా ర్యాగింగ్ నిర్వచనంలో ‘‘జాతి దూషణలు’’, ‘‘జాతిని టార్గెట్ చేయడం’’ వంటివి చేర్చాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇది విద్యా విద్యాసంస్థల్లో సిక్కు విద్యార్థులను అగౌరవపరచడాన్ని వ్యతిరేకిస్తుంది.