Waqf Act: దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కి రంగం సిద్ధమైంది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ‘‘ఉమీద్’’ పోర్టల్‌ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి’ అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆస్తుల పొడవు,…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం…
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల నీతి నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు…
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ, టెట్ నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు.. దీంతో, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..టెట్, డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
KTR : తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్… ప్రాజెక్టులు, కేసులు, బదిలీలు, నోటీసులు వంటి పలు అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఆయన, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా నడుస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏమీలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా కాళేశ్వరం గురించి కూడా…
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్‌పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.