Supreme Court: 2026 జనగణన తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు.. డీలిమిటేషన్ పై పిటిషన్ తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్‌పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, దేశంలో తదుపరి జనాభా లెక్కలు (జనగణన) జరిగే 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు (డీలిమిటేషన్) సాధ్యమని స్పష్టం చేసింది.
Also Read
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి తన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని కోరారు. ఇందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225 సీట్లు పెంపు జరగాలని ఆయన అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై విభిన్నంగా స్పందించింది. పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కాబట్టి, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్నిర్వచనం (డీలిమిటేషన్) 2026 జనగణన తరువాత మాత్రమే సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఆ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశమేమీ లేదని స్పష్టం చేసింది.
WAR 2 Trailer Review : అదిరిన విజువల్స్.. యాక్షన్ సీన్స్ సూపర్బ్..
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?