Supreme Court: ఒడిశా బాలాసోర్‌లో ఉపాధ్యాయుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురకావడంతో 20 ఏళ్ల బి.ఎడ్ విద్యార్థిని ఆత్మాహుతి చేసుకుని మరణించిన సంఘటనను సుప్రీంకోర్టు “సిగ్గు”గా అభివర్ణించింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల బాలికలు, గృహిణులు, పిల్లల సాధికారత కల్పించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సూచించాలని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తరపు న్యాయవాది ఈ సంఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత న్యాయమూర్తులు సూర్యకాంత్ , జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘మేము సిగ్గుపడుతున్నాం, ఈ సంఘటన ఇప్పటికీ జరగడం దురదృష్టకరం. ఇది వ్యతిరేఖ పిటిషన్ కాదు, కేంద్రం, అన్ని రాష్ట్రాల నుంచి మాకు సూచనలు అవసరం’’ అని ధర్మాసనం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలన్ని శక్తివంతంగా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే సూచనలను అవసరమని చెప్పింది. ఒడిశా ఆత్మహత్య కేసు గురించి సీనియర్ న్యాయవాది పావని మాట్లాడుతూ, బాధితురాలు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి సహాయం అందించలేదని, ప్రభుత్వానికి లేఖలు పంపించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.