Udaipur Files: “ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు: సుప్రీంకోర్టు..
- ఉదయ్‌పూర్ ఫైల్ సినిమాపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..
- హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని ఆదేశం..
- నుపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై వ్యాఖ్యల్ని సమర్థించినందుకు హత్య..
- కన్హయ్యలాల్ అనే దర్జీని హత్య చేసిన ఇద్దరు మతోన్మాదులు..
- ఈ కథాంశం ఆధారంగా నిర్మితమైన ఉదయ్‌పూర్ ఫైల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన “ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.
అయితే, ఈ సినిమా రిలీజ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనున జూలై 28న విచారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. జూలై 21న కేంద్రం సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేయడాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లను ఆదేశించింది. కేంద్రం ఉత్తర్వులతో చిత్ర నిర్మాత సంతృప్తిగా ఉన్నాడని, సుప్రీంలో కేసు కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని, కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్లాలని, మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Bombay High Court: దేశ సమస్యలు వద్దు కానీ, “గాజా” కావాలా.? సీపీఎం పార్టీపై హైకోర్టు ఆగ్రహం..
నిజానికి జూలై 11, 2025లోనే సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలను అడ్డుకోవాలని జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తరుఫున కబిల్ సిబల్, నిందితుల్లో ఒకరి నుంచి వాదిస్తున్న గురుస్వామిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు వీరందర్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అందకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి, సినిమాలో కొన్ని సవరణలు, మార్పులను సూచించింది.
హైకోర్టు ఈ కేసును టేకప్ చేసే వరకు స్టే జారీ చేయాలని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఇందులో కలుగజేసుకునేందుకు ఒప్పుకోలేదు. మరోవైపు, చిత్ర నిర్మాతలు కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు సమాజంలో ఎలాంటి అశాంతి చెలరేగలేదనే విషయాన్ని కోర్టు ముందుకు తెచ్చారు. చిన్న విషయాన్ని వారు పెద్దగా చూపిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!