Made in Korea: ఆకట్టుకుంటున్న ‘మేడిన్ కొరియా’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ నటి ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రా. కార్తిక్ రూపొందించిన వినూత్న చిత్రం ‘మేడిన్ కొరియా’. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Also Read : Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!
Also Read
తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువతికి దక్షిణ కొరియా వెళ్లాలనేది జీవిత లక్ష్యం. అసలు బాల్యంలోనే ఆమె ఆ దేశానికి వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకుంది? ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి కొరియా వెళ్లే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తీరా అక్కడికి వెళ్ళాక ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగనుంది.
ప్రియాంకా మోహన్ ఈ పాత్రలో ఎంతో సహజంగా కనిపిస్తూ తన నటనతో మెప్పించబోతున్నారు. అయితే ఈ సినిమా వెండితెరపై కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదల కానుంది. ఈ నెల మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ కల్చర్.. డ్రామాలకు మన దగ్గర మంచి ఆదరణ ఉన్న తరుణంలో, ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఓటీటీ ఆడియన్స్‌ను కచ్చితంగా అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రియాంకా మోహన్ ఫ్యాన్స్ ఈ క్రేజీ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?