Supreme Court: ‘‘కన్స్యూమర్ ఈస్ కింగ్’’.. కస్టమర్లకు హోటళ్ల వివరాలు తెలుసుకునే హక్కు ఉంది..
- వినియోగదారుడే రాజు, హోటళ్ల గురించి తెలుసుకునే హక్కు ఉంది..
- కన్వర్ యాత్రలో హోటల్ వివరాలు ప్రదర్శించాలని యూపీ ఆదేశం..
- ప్రభుత్వ ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కన్వర్ యాత్ర చివరి రోజు ఇదే అని పేర్కొంది. అయితే, ప్రభుత్వం విక్రేతల పేర్లు, గుర్తింపును వెల్లడించమని బలవంతం చేయగలదా అనే ప్రధాన అంశాన్ని కోర్టు పెండింగ్‌లో ఉంచింది.
Read Also: Tamil Nadu: అజిత్ కుమార్ కస్టడీ డెత్.. రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
అధికారులు జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కె సింగ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ‘‘వినియోగదారుడే రాజు’’ అని చెబుతూ, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, తయారీ పద్ధతులను గురించి, ఆ స్థలంలో గతంలో మాంసాహార ఆహారాన్ని అందించారా.? లేదా.? అనే దానితో సహా అన్నింటిని వినియోగదారుడు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది. యాత్ర ప్రయోజనం కోసం మాత్రమే, ఎవరైనా మాంసాహారం నుంచి శాఖాహరంగా మారితే, వినియోగదారుడు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
చట్టం ప్రకారం విక్రేతలు తమ లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లను ప్రదర్శించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యావేత్త అపూర్వానంద్ ఝాతో సహా వివిధ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, హుజెఫా అహ్మది వాదనలు వినిపించారు. యూపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరుపున సింఘ్వీ వాదిస్తూ.. మైనారిటీ రెస్టారెంట్లను బహిష్కరించే కుట్ర ఉందని వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు, “వినియోగదారుడే రాజు” అని ఆయన వ్యాఖ్యానించారు, ఒక హోటల్ శ్రావణ మాసంలో మాత్రమే శాఖాహార ఆహారాన్ని అందిస్తుందా లేదా సంవత్సరం పొడవునా వర్తిస్తుందా అని తెలుసుకునే హక్కు వారికి ఉందని చెప్పింది.
తాజావార్తలు
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!