Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఆయన పదవీగండం ఎదుర్కుంటున్నట్లు సమాచారం.
Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు (మంగళవారం) విచారించనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.
Supreme Court: 1995 చట్టంలోని ఏవైనా నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన ఏ పిటిషన్ని కూడా స్వీకరించబోమని, వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలును తాత్కాలికంగా నిలుపుదల కోరుతూ నమోదైన పిటిషన్లను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై నేతృత్వంలోని డివిజన్ బెంచ్, చట్టంలోని మూడు వివాదాస్పద అంశాలపై మధ్యంతర ఉత్తర్వు అవసరమా..? కాదా..? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. Read Also: Shhyamali…
కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మంత్రిగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండని, ముందుగా హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రి విజయ్…
నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. “అమైకస్ క్యూరీ” గా పరమేశ్వరన్ వ్యవహరించారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు చెట్లను తొలగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు. ఇదంతా ముందస్తు పథకం…
President Droupadi Murmu: ఇటీవల తమిళనాడు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లు బిల్లులను ఆమోదించడంలో సమయపాలనకు లోబడి ఉండాలా..? అనే అంశంపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. ఇందుకోసం ఆమె భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ఆధారంగా సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. Read Also: UN-India: TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా ఐరాసలో భారత్ ప్రయత్నాలు..! రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులు గవర్నర్కు పంపినప్పుడు, గవర్నర్ తనకు అందుబాటులో…
డిప్యూటీ కలెక్టర్ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్కు ధర్మాసనం ఆదేశాలు…