తెలంగాణ రాష్ట్రానికి చెందిన, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పి.నిరూప్ను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు నియమించింది. తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులైన తొలి న్యాయవాది నిరూప్. నిరూప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్, మంత్రి దివంగత పి. రామచంద్రారెడ్డి కుమారుడు. ఆయన మెదక్ జిల్లాకు చెందినవారు. 1985లో బార్ కౌన్సిల్లో చేరిన తర్వాత సంగారెడ్డిలోని మున్సిఫ్ కోర్టులో ప్రాక్టీస్ చేసి సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017-2018కి ఢిల్లీలోని మేఘాలయ, షిల్లాంగ్ రాష్ట్రానికి…
దిశ నిందితుల ఎన్కౌంటర్ తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ పై హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది.ఈ కమిషన్ సభ్యులు ఆదివారం నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్కౌంటర్ పై విచారణ చేస్తుంది. కరోనా కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది. దీంతో కమిషన్‌కు సుప్రీం కోర్టు గడువును పెంచింది. దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి ప్రాంతాన్ని సిర్పూర్కర్…
దేశ రాజధానిలో కాలుష్యాన్ని 24 గంటల్లోగా అరికట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సూచించకపోతే.. కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము మీకు 24 గంటలు ఇస్తున్నాము. మీరు దీనిని తీవ్రంగా పరిశీలించి, సీరియస్‌గా పరిష్కారం చూపాలని…
బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము విజయ్ మాల్యా కోసం వేచిచూడలేమని స్పష్టం చేసింది. విజయ్ మాల్యా వచ్చినా.. రాకున్నా.. జనవరి 18న శిక్షను విధిస్తామని తేల్చి చెప్పింది. Read Also: కొత్త బిజినెస్ ప్రారంభించిన ‘ఓలా’ విజయ్…
పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ స్పందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రిగారి ప్రవేశం పాటకు ఊపిరులూదింది అన్నారు. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి గారు. సాహితీ విరించి సీతారామశాస్త్రిగారికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు,…
గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. అనంతరం శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. శేషాద్రి స్వామితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఎన్వీ రమణ…
ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత సైన్యం 577 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నవంబర్ 25, 2021 నాటికి అర్హత కలిగిన 63 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సందర్భంగా దీనిపై ఆయన వివరణ…
ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పొల్యూషన్ తగ్గినా.. కేసు మూసివేసేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఏమీ చేయకపోడంతోనే కోర్టులు జోక్యం చేసుకో వాల్సిన అవసరం వస్తుందనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీసుకున్న కొన్ని చర్యల వల్ల 40 శాతం కాలుష్యం తగ్గిందని కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయని చెబుతున్నారని, అవి సరైవనో కాదోతెలియదని సొలిసీటర్ జనరల్‌తో పేర్కొన్నారు. ఈ…
దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించిన స్థలంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమి వినియోగాన్ని మార్చడానికి గల కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ…
సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్యకేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. సత్యంబాబు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని…