లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ధర్మాసనంపై అక్షింతలు వేసింది. నిందితుడు బాలిక శరీరానికి నేరుగా తాకనప్పుడు అది పోక్సో చట్టం కిందకు రాదన్న తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలను లేదా మహిళలను దుస్తుల పై నుంచి తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.…
మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీజేఐ ఎన్.వి. రమణ. “గే” ని జడ్జిగా నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ సౌరభ్ కిర్పాల్ పేరు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా సౌరభ్ కిర్పాల్ పై నిర్ణయం తీసుకోలేదు కొలీజియం. సౌరభ్ కిర్పాల్ మాజీ సీజేఐ బీఎన్ కిర్పాల్ కుమారుడు. 2017లో మొదటిసారి సౌరభ్ కిర్పాల్ పేరును సిఫార్సు చేసింది ఢిల్లీ హైకోర్టు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని, జీవిత…
ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని పిటిషన్ వేసిన ఏపీ ఉద్యోగులు.. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 3లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ వేయకపోతే ప్రతివాదులంతా కోర్టుకు రావాల్సి ఉంటుందన్న సుప్రీం చెప్పింది. డిసెంబర్ 8న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఆగస్టులో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరిగింది. దీనిపై…
నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమానికి సుప్రీంకోర్డు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా తీర్పులు సులభంగా అర్థమయ్యేలా, స్పష్టమైన భాషలో ఉండాలని, న్యాయమూర్తులు సాధరణ భాషలో తీర్పు రాయాలని ఆయన అన్నారు. కోర్టుల నిర్ణయాలకు సామాజికంగా ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయిలో…
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి వారం పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు…
సుప్రీం కోర్టు హెచ్చరిక తర్వాత ఆర్మీ మహిళలకు శాశ్వత కమిషన్‌ను నియమించేదందుకు అంగీకరించింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమీషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్క రించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తామని నవంబర్ 12, శుక్రవారం ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఈ విషయంపై గతంలో ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడతారని సుప్రీంకోర్టు…
పాకిస్తాన్లో హిందూవులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఒక్క దేవాలయం కూడా నిర్మించలేదు. పైగా వేలాది దేవాలయాలను కూల్చివేశారు. ఇక ఇదిలా ఉంటే, పాక్‌లో ఇటీవలే ఓ కొత్త ఆలయాన్ని నిర్మించారు. పాక్ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వం చేత ఆలయాన్ని నిర్మించింది. ఆలయ పునర్నిర్మాణం అనంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ గుల్జార్ అహ్మద్ ఆ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు…
బాణా సంచాను ఈఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు టపాసులను దిగుమతి చేసుకోవాలని దీనిపై బెంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీం కోర్టు. హరిత టపాసులకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై ఆయా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో…
కొద్ది రోజుల క్రితం పెగాసిస్ స్పైవేర్ యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. భారత్ పార్లమెంట్‌ని తీవ్రంగా కుదిపేసిన పెగాసిస్ అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఈ వివాదం మరోసారి మీడియా హెడ్లైన్లలో నిలిచింది. దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన పెగాసిస్ ఎపిసోడ్లో సుప్రీంకోర్టు తీర్పు ఒక అనూహ్య పరిణామం. ఈ స్పైవేర్‌ని పౌరులపై ప్రయోగించలేదని కేంద్రం వాదిస్తోంది. ఐతే, కేంద్రం చెపుతున్న…
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని, సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్‌పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు రిటైర్డ్…