లఖింపూర్ ఘటనపై రైతులు మండిపడుతున్నారు. అటు, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లఖింపూర్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. అయితే, లఖింపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నది. సీబీఐ చేత విచారణ చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు…
నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్నే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. పరీక్ష నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై మండిపడింది… పాత సిలబస్ ప్రకారం టెస్ట్ నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు…
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస దురదృష్టకరమని సోమవారం విచారం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని విచారం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన (సత్యాగ్రహం ) నిర్వహించడానికి అనుమతి కోరుతూ “కిసాన్ మహాపంచాయత్” దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే లఖింపూర్ ఖేరి లాంటి సంఘటనలు నిరోధించేందుకు, ఏలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతించరాదని కేంద్రం తరఫున హాజరైన…
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని,…
న్యాయ వ్యవస్థలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ప్రాతినిథ్యమే లేకపోగా, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారాయన. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు సీజేఐ. ఆకాశంలో సగం… అవకాశాల్లోనూ మహిళలకు సగం వాటా ఇవ్వాల్సిందే అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. మన న్యాయ…
ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు, లాయర్లు కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. కోర్టుల భద్రత అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైందన్నారు. కోర్టుల భద్రత అంశంపై వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.శుక్రవారం ఢిల్లీ…
ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరీ అయిన వెంటనే విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీల విడుదల చేసేలా సిజె ఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుమోటో గా కేసు విచారణను చేపట్టిన సుప్రీం ధర్మాసనం… ఖైదీల విడుదలలో జాప్యాన్ని నివారించేందుకు ఫాస్టర్ విధానం అమలుకు…
తీవ్ర వివాదానికి దారి తీసిని పెగాసస్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. పెగాసస్పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. కమిటీకి సంబంధించి వచ్చేవారం ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు.. భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. కాగా, ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ను తమ…
కరోనా మహమ్మారి బారినపడి చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ విడుదల చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం.. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా ఇస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని పొందాలంటే సదరు వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు…