ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో…
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్…
భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్ ఎఫెక్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల…
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…
ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి…
ఢిల్లీని కరోనా వణికిస్తోంది. కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్లో 400 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టెస్టులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వరసగా బయటపడుతున్నాయి. కోర్టులో 3 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 150 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. Read: ఢిల్లీ బాటలో రాజస్థాన్… ప్రజలకు…
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం…