ఏపీ సీఎస్‌పై సుప్రీం సీరియస్.. 2 గంటలకు కోర్టు ముందుకు రండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది.. వారు చట్టానికి అతీతులు కాదు.. మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాల్సిందేనంటూ ఈ సందర్భంగా స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
Read Also: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఇంటికి బెజవాడ పోలీసులు..
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
కాగా, కోవిడ్‌తో మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా పరిహారం చెల్లింపు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA)ని జూన్ 30, 2021న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను NDMA విజ్ఞతకే వదిలివేసింది కోర్టు.. తదనంతరం, కోవిడ్-19 మృతుల కుటుంబాలకు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని సిఫారసు చేసినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. మరణించిన వారి బంధువులకు రూ.50,000 చెల్లించాలని కేంద్రం చేసిన సిఫార్సును కోర్టు అక్టోబర్ 2021లో ఆమోదించింది. అయితే, పరిహారం చెల్లింపు విషయంలో జాప్యం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. తక్షణం సుప్రీంకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!