గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. అనంతరం శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. శేషాద్రి స్వామితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఎన్వీ రమణ…
ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత సైన్యం 577 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ను మంజూరు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నవంబర్ 25, 2021 నాటికి అర్హత కలిగిన 63 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సందర్భంగా దీనిపై ఆయన వివరణ…
ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పొల్యూషన్ తగ్గినా.. కేసు మూసివేసేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఏమీ చేయకపోడంతోనే కోర్టులు జోక్యం చేసుకో వాల్సిన అవసరం వస్తుందనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీసుకున్న కొన్ని చర్యల వల్ల 40 శాతం కాలుష్యం తగ్గిందని కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయని చెబుతున్నారని, అవి సరైవనో కాదోతెలియదని సొలిసీటర్ జనరల్తో పేర్కొన్నారు. ఈ…
దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించిన స్థలంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమి వినియోగాన్ని మార్చడానికి గల కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ…
సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్యకేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. సత్యంబాబు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని…
లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ధర్మాసనంపై అక్షింతలు వేసింది. నిందితుడు బాలిక శరీరానికి నేరుగా తాకనప్పుడు అది పోక్సో చట్టం కిందకు రాదన్న తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలను లేదా మహిళలను దుస్తుల పై నుంచి తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.…
మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీజేఐ ఎన్.వి. రమణ. “గే” ని జడ్జిగా నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ సౌరభ్ కిర్పాల్ పేరు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా సౌరభ్ కిర్పాల్ పై నిర్ణయం తీసుకోలేదు కొలీజియం. సౌరభ్ కిర్పాల్ మాజీ సీజేఐ బీఎన్ కిర్పాల్ కుమారుడు. 2017లో మొదటిసారి సౌరభ్ కిర్పాల్ పేరును సిఫార్సు చేసింది ఢిల్లీ హైకోర్టు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని, జీవిత…
ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని పిటిషన్ వేసిన ఏపీ ఉద్యోగులు.. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 3లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ వేయకపోతే ప్రతివాదులంతా కోర్టుకు రావాల్సి ఉంటుందన్న సుప్రీం చెప్పింది. డిసెంబర్ 8న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఆగస్టులో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరిగింది. దీనిపై…
నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమానికి సుప్రీంకోర్డు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా తీర్పులు సులభంగా అర్థమయ్యేలా, స్పష్టమైన భాషలో ఉండాలని, న్యాయమూర్తులు సాధరణ భాషలో తీర్పు రాయాలని ఆయన అన్నారు. కోర్టుల నిర్ణయాలకు సామాజికంగా ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయిలో…
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి వారం పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు…