2021లో దేశవ్యాప్తంగా 144 మందికి మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోర్టులు గతేడాది 144 మంది నేరస్థులకు మరణ శిక్షలను ఖరారు చేశాయి. అప్పటికే మరణశిక్షలు పడి, అమలు పెండింగ్ లో ఉన్నవారందరిని కలిపి చూస్తే.. 2021 చివరికి మొత్తం 488 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ విడుదల చేసింది. ప్రతి ఏటా గణాంకాలను విడుదల చేస్తుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెషన్స్ కోర్టులు 2021లో 34 మందికి మరణ శిక్షలను ఖరారు చేశాయి. గతేడాది ఎక్కువ మందికి మరణ శిక్షలు పడింది ఈ రాష్ట్రంలోనే. దీంతో ఈ రాష్ట్రం నుంచి ఉరిశిక్షల అమలుకు వేచి ఉన్న ఖైదీల సంఖ్య 86కు పెరిగింది.
Read Also: ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన: కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ఆ తర్వాత ఏపీలో 13 మందికి, తెలంగాణలో ఒకరికి స్థానిక కోర్టులు మరణ శిక్షలు విధించాయి. సుప్రీంకోర్టు మాత్రం గతేడాది ఒక్క కేసులోనూ ఈ శిక్షను ఖరారు చేయలేదు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 2016 చివరికి 400గా ఉంటే, 2017 చివరికి 366కు తగ్గింది. 2018లో 426కు, 2019లో 378కు, 2020లో 404కు, 2021 చివరికి 488కు సంఖ్య పెరిగింది. ఉరిశిక్షలు విధించినా, మన దేశంలో వాటి అమలు చాలా తక్కువ కేసుల్లోనే ఉంటోంది. సుదీర్ఘకాలంపాటు అప్పీళ్లతో ఉరిశిక్షల అమలు వాయిదా పడుతుంటుంది. చివరికి క్షమాభిక్ష రూపంలో శిక్ష తగ్గింపు ఉంటుంది. అయితే ఉరి శిక్ష పడ్డ ఖైదీల్లో ఎక్కువ శాతం మంది జీవిత ఖైదుగానే మిగిలిపోతున్నారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉరి శిక్షలను కోర్టులు అమలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!