టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి భీమిరెడ్డి శ్రీసుధతో గతంలో అతడు సహజీవనం చేయగా ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
Read Also: లతా మంగేష్కర్ చివరి పాట ఏంటో తెలుసా ?
అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును శ్రీసుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ కె నాయుడు మూలంగా తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… శ్రీసుధ పిటిషన్‌ను కొట్టివేసింది. శ్రీసుధ కేసులో తాను ఒప్పందం ప్రకారమే సహజీవనం చేశానని.. అందుకు రూ.50 లక్షలు డీడీ రూపంలోచెల్లించానని పత్రాలను శ్యామ్ కె.నాయుడు కోర్టుకు సమర్పించాడు. దీంతో అతడికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.