సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ లో ఎన్నో హిట్స్ ప్లాపులు వచ్చిన సరే ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఘట్టమనేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేశ్. Also Read : Janhvi…
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, విజయ నిర్మల గురించి కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా అభిమానుల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు. ఇక పండగ వేళ కృష్ణ ఇంట విషాదం చోటుచేసుకుంది.
2022 ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య.. రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాల అభిమానులను సైతం శోకసంద్రంలో ముంచింది. గతేడాది నవంబర్ 15న కృష్ణ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన ప్రథమ వర్థంతి. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ ఆయనను గుర్తు…
Varasudu: అరె... ఇదేంటి ఈ సంక్రాంతికేగా విజయ్ 'వారసుడు' రిలీజ్ అయింది. అప్పుడే ముప్పై ఏళ్ళా? అని ఈ తరం వారు భావించే అవకాశం ఉంది. కానీ, 30 ఏళ్ళ క్రితం నాగార్జున హీరోగా ఓ 'వారసుడు'జనాన్ని అలరించింది.
నటశేఖర కృష్ణ, అందాలరాశి శ్రీదేవి జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. శ్రీదేవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన క్రెడిట్ కృష్ణకే దక్కుతుంది. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఆరంభమైన కృష్ణ, శ్రీదేవి జోడీ తరువాత దాదాపు పాతిక చిత్రాలలో కనువిందు చేసింది. వారిద్దరూ నటించిన చిత్రాలలో ‘కిరాయి కోటిగాడు’ కూడా భలేగా సందడి చేసింది. ఈ చిత్రానికి ముందు కృష్ణ-శ్రీదేవి జంటగా “బుర్రిపాలెం బుల్లోడు, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, అదృష్టవంతుడు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంగారు బావ,…
Niluvu Dopidi: నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే అభినయించారు. విశేషమేమిటంటే, ఎన్టీఆర్‌తో కృష్ణ నటించిన ఐదు చిత్రాలలోనూ ఆయనకు తమ్మునిగానే నటించారు. కృష్ణ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో రూపొందిన ‘నిలువు దోపిడీ’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన యు.విశ్వేశ్వరరావు నిర్మించారు. తరువాతి రోజుల్లో విశ్వేశ్వరరావు కూతురును యన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ వివాహం చేసుకోవడంతో వారిద్దరూ వియ్యంకులు కూడా…
Krishna's movie 'Eenadu' completes 40 years: 'నటశేఖర'గా, 'సూపర్ స్టార్'గా అభిమానుల మదిలో చోటు సంపాదించిన కృష్ణ నటించిన 200వ చిత్రం 'ఈనాడు'. మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ఇందులో నాయిక లేకుండా నటించడం అప్పట్లో ఓ సాహసంగా చెప్పుకున్నారు. అదీగాక ఈ చిత్రాన్ని కృష్ణ తమ సొంత 'పద్మాలయా పిక్చర్స్' పతాకంపై నిర్మించి, నటించారు. అందువల్ల తొలి నుంచీ 'ఈనాడు' పై సినీఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. 1982 డిసెంబర్ 17న విడుదలైన 'ఈనాడు'…
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మృతి తరువాత మహేష్ బాబు కుంగిపోయిన విషయం అందరికి తెల్సిందే. ఒక్క ఏడాదిలోనే ముగ్గురు కుటుంబసభ్యులు.. ముఖ్యంగా దేవుడిలా కొలిచే తండ్రి మరణంతో మహేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.