సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు నిన్న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ రమేష్ బాబు ఆసుపత్రికి చేరుకునే లోపే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. రమేష్…
నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణతో పాటు పలువురికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందని స్వాతంత్ర సమర యోధులను గుర్తించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరి లేకపోతే మనలో ఆ తెగింపు రాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా…
ప్రిన్స్ మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార లకు తాతయ్య కృష్ణ అంటే ఎంతో అభిమానం. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉండకపోయినా, తరచూ జరిగే ఫ్యామిలీ గేదరింగ్స్ లో అంతా కలుస్తూ ఉంటారు. ఇక బర్త్ డేస్, స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ లో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో కృష్ణ కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. లేదంటే ఆ పనిని కృష్ణ చిన్నల్లుడు,…
యాక్షన్ మూవీస్ తో కృష్ణ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొనే క్రమంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’తో తొలి తెలుగు కౌబోయ్ హీరో అనిపించుకున్నారు. ఆ చిత్రం తరువాత కృష్ణతో సినిమాలు తెరకెక్కించిన వారందరూ యాక్షన్ కే పెద్ద పీట వేశారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రమే ‘చలాకీ రాణి – కిలాడీ రాజా’. అప్పట్లో యాక్షన్ లేడీగా విజయలలితకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. ‘రౌడీ రాణి’ చిత్రంతో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారామె. ఈ నేపథ్యంలో కృష్ణ,…
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భీమవరంలోని కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుటలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచార’ని…