Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మృతి తరువాత మహేష్ బాబు కుంగిపోయిన విషయం అందరికి తెల్సిందే. ఒక్క ఏడాదిలోనే ముగ్గురు కుటుంబసభ్యులు.. ముఖ్యంగా దేవుడిలా కొలిచే తండ్రి మరణంతో మహేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తండ్రి అంత్యక్రియల్లో మహేష్ కంటనీరు చూసిన అభిమానులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఇక తాజాగా తండ్రిని తలుచుకొని మహేష్ ఎమోషనల్ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
“మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు.. మీరు వెళ్లిపోవడం అంతకన్నా గొప్పగా జరిగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు..ధైర్యం. చురుకైన స్వభావం మీది. నా స్పూర్తి.. నా ధైర్యం.. మీలో
నేను చూసుకున్నవన్నీమీతోనే వెళ్లిపోయాయి. కానీ విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని ఈ శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. మీవెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను.. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తండ్రి లేని లోటును తీర్చలేం కానీ, నీకెప్పుడు అండగా ఉంటాం అన్నా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022